Disable Copy Paste - HTML/JavaScript

Monday, July 14, 2014

ఆహ...!! ఆ రోజులే వేరు


ETV లో  వార్తలు  వస్తుంటే  “స్కూల్  పిల్లలకు  వేసవి  సెలవులు  వచ్చేస్తున్నాయి”  అంటూ  ముఖ్యాంశాలలో  ఎదో  చెప్పినట్లు  వినిపించింది. 

అప్పుడు  “చెవుల  పండుగు”  లాగా  అనిపించింది. 

చూడటానికి  బాగున్నప్పుడు  కనుల  పండుగ  అంటారు  కదా,  మరి  వినడానికి  వినసొంపుగా  ఉన్నప్పుడు  చెవుల  పండుగ  అనడంలో  తప్పేముంది!  J

వేసవి  సెలవులు  అనే  శబ్దం  వినడానికి  ఎంత  బాగుందో....!!!

చివరి  రోజు  పరీక్ష  పూర్తయ్యాక  ఇంటికి  వెళ్తూ  ఉన్నప్పుడు  కలిగే  అనుభూతి  న  భూతో  న  భవిష్యత్!

ఈ  సాఫ్ట్  వేర్  ఉద్యోగం  లో  చేరాక    ప్రతి  సంవత్సరం  వేసవి  కాలం  వస్తోంది  కాని  వేసవి  సెలవులు  మాత్రం  రావట్లేదు.  పండుగ  సెలవులుsick  leaves,  paid  leaves,  weekends......  ఇలా   రకరకాల   సెలవులు  ఉంటాయి  కాని  వేసవి  సెలవులు  అనేవి  మాత్రం  సాఫ్ట్  వేర్  ఉద్యోగి  సిలబస్  లో  ఉండవు. 

వేసవైనా,  శీతాకాలమైనా  ఆఫీసులో  ID  కార్డు  swipe  చెయ్యాల్సిందే  L.

వేసవి  సెలవుల  గురించి  రాయాలని,  అప్పుడెప్పుడో  వేసవి  మొదలయ్యినప్పుడు  అనుకున్నాను.  కాని  ఇప్పటికి  తీరిక  దొరికింది. 

ఇంతకు  వేసవి  సెలవులు  అంటే  ఎందుకు  అంత  ఇష్టం,  అని  ఆలోచిస్తే  బాగానే  కారణాలు  దొరికాయి.
·       స్కూల్  కి  వెళ్ళే  పని  ఉండదు 
·       పరీక్షల  గోల  ఉండదు 
·       పొద్దున్నే  లేచి  రెడీ  అయ్యే  అవసరం  ఉండదు
·       మా  అమ్మమ్మ  వాళ్ళ  ఊరులో  exhibition  కి  వెళ్ళొచ్చు
·       ఎక్కువ  సేపు  ఆడుకోవచ్చు 
·       ...
·       ...
·       ...
·       ...
·       ...

ఇలా  చాలానే  ఉన్నాయి.  నాకు  గుర్తున్నంత  వరకు,  వేసవి  సెలవులలో  కాస్త  కష్ట  పడుతూ  చేసిన  ఒకే  ఒక్క  పని,  hand-writing  మెరుగు  పరుచుకోవడానికి  ప్రతి  రోజు  కొన్ని  పేజీలు  రాయడం  (నా  చేతి  రాత,  కాలుతో  రాసినట్లు  ఉండేది  లేండి  J).  కారణాలు  కాసేపు  పక్కన  పెట్టేద్దాం.

ఒక  ఐడియా!
సాఫ్ట్  వేర్  ఇంజనీర్లు  అంత  కలిసి  సెలవుల  కోసం  strike  చేస్తే...??

వద్దులే!  అసలే  ఇన్ని  రోజులు  తెలంగాణా  కావాలని  కొందరు,  వద్దని  కొందరు  చాలా  strike  లు  చేసారు.  ఈ  మధ్యనే  ఆ  strike  లనుంచి  విముక్తి  దొరికింది.  మళ్లీ  strike  అంటే  బాగుండదు  లేండి.

ఇంకో  ఐడియా!

చిన్నప్పుడు  వేసవిలో  మార్నింగ్  స్కూల్  అని  ఉండేది  కదా,  ఇప్పుడు  కూడా    మార్నింగ్  ఆఫిస్  అని  పెడితే  ..........?????    

ఇదేదో  బాగున్నట్లుందే..!!! 

అమ్మో..!!  సగం  time  ఇచ్చి  మొత్తం  పని  చెయ్యమంటే,  మొదటికే  మోసం  వచ్చేస్తుంది.  ప్రస్తుతానికి  ఇలాగే  సెలవులు  లేకుండ  సరిపెట్టుకోవాల్సిందే.

ఈ  సాఫ్ట్  వేర్  ఉద్యోగం  దయ  వల్ల  వేసవి  సెలవులనేవి  లేకుండా  పోయినా,  బెంగుళూరు  దయవల్ల  ఎండాకాలం  లో  ఎండకాలం కష్టాలు  కూడా  లేకుండా  పోయాయి.  ఒకటి  కావాలంటే  ఇంకొకటి  వదులుకోవాల్సి  వస్తుందంటే  ఇదేనేమో!

కాసేపు  బాధ  పడడం  ఆపి  ఫ్లాష్  బ్యాక్  లోకి  వెళ్తే...

వేసవి  సెలవులు  మొదలయ్యే  అనుభూతి  గురించి  మాట్లాడాం  కదా!
ఆలాగే  సెలవులు  అయ్యాక  స్కూలు  మొదలవ్వడం  కూడా  అదో  తరహ  అద్భుతమైన  అనుభూతి.

కొత్త  text  books  కొనడం,  వాటికి  అట్టలు  వెయ్యడం,  sticker  లు  అంటించడం  (అదే  నా  విషయం  లో,  పాత  text  books  కి  మళ్లీ  అట్టలు  వెయ్యడం,  sticker  లు  అంటించడం.  ఎందుకంటే,  మా  అన్న  తన  ఆస్తి  నాకు  రాసిస్తాడు  కాబట్టి  J),  స్కూల్  లో  కొత్త  time-table,  కొత్త  బట్టలు*(conditions  apply  J),  కొత్త  టీచర్లు*  (ఇది  కూడా  conditions  apply  J)  ........  అలా  స్కూల్  మొదలవుతుంది. 

ఇప్పుడు  ఎలాగో  వేసవి  సెలవులు  లేవు  కాబట్టి,  కనీసం  ఒకప్పటి  జ్ఞాపకాలు  గుర్తు  చేసుకోవడానికి  సమయం  కేటాయించుకున్నందుకు  నా  ఈ  weekend  కి  మోక్షం  కలిగింది.

సరే మరి.... మళ్లీ  వచ్చే  వేసవి  సెలవుల్లో  దీని  గురించి  మాట్లాడదాం J


Popular Posts