Disable Copy Paste - HTML/JavaScript

Saturday, January 4, 2014

నాకో సందేహం!


బ్లాగ్  శీర్షిక  చదవగానే  ఇదేదో  వంటల  'వెబ్ సైట్'  అనుకుంటారేమో!
అయితే  మీరు  ‘సీడీ’  ని  చూసి  ‘డీవీడీ’  అనుకున్నట్లే.
(పప్పు  లో  కాలేసారు  అనడం  పాత  సామెత  J)


అసలు  విషయం  ఏంటి  అంటే,  నాకో  సందేహం  ఉంది.
ఇంతకు  మీకు  ఏమంటే  ఇష్టం  ……????


నాకు  మా  అమ్మ  అంటే  ఇష్టం.  
క్రికెట్  లో    సచిన్  టెండూల్కర్  అంటే  ఇష్టం.
అలాంటి  ఇష్టాలు  కాకుండా  ఇంకేమైనా  చెప్పండి.


ఆకస్మికంగా  ఇలా  అడిగేశాడేంటి….??”,  అనుకుంటున్నారు   కదా!
ఎవరో    మీ  బుర్ర  అనే  ‘టీవీ’  ని  ‘మ్యూట్’    చేసినట్లు  అనిపిస్తోందా  ?


మీ  సంగతేమో  గాని  నాకైతే  అలాగే  అయ్యింది,  
ఒక సారి ఈ ప్రశ్న నాకు నేను వేసుకున్నప్పుడు.  కాబట్టి  భవిష్యత్తులో  ఇంకెవరైనా  ఇదే  ప్రశ్న  అడిగితే,  
చిన్నప్పుడు  ఒకటో  ఎక్కం  గడ  గడ  చెప్పినట్లు  చెప్పాలని  నిర్ణయించుకున్నాను.


2010  మార్చ్  29   (క్షమించాలి!  సమయం  సరిగ్గా  గుర్తులేదు  J)   పుస్తకం  లో  రాయడం  మొదలుపెట్టాను.  
  ఇష్టాల  జాబితా  కాస్త  చిన్న  జనరల్  నాలెడ్జ్  
పుస్తకం  అంత  అయ్యిపోయింది.


ఇంతకు  నాకేమిష్టమంటే, 

·        పొద్దున్నే  లేచి    పక్షులు  చేసే  సంగీతం  వింటూ  సూర్యోదయాన్ని  ఆస్వాదించడం  ఇష్టం
·        రెండు  జడలు  ఉన్న  అమ్మాయిలంటే  ఇష్టం
·        పిల్లలతో  సరదాగా  మాట్లాడడం  ఇష్టం
·        ఉంగరాల  జుట్టు  ఇష్టం
·        లేత  కొబ్బరి బొండం  లోపల  ఉన్న  కొబ్బెరని  తినడం  ఇష్టం.
(ఇది  రాస్తూ  ఉంటే  నోరు  ఊరుతోంది)
·        మిద్దెపైన  పడుకుని  పాటలు  వింటూ  ఆకాశం  లోని  నక్షత్రాలు  లెక్కబెట్టడం  ఇష్టం. 
·        సంక్రాంతి  పండగకి  బంధువులందరిని   కలవడం  ఇష్టం. 
·        దుమ్ము  పడిన  కారు  కిటికీ  మీద  నా  పేరు  రాసుకోవడం  ఇష్టం. 
·        క్యారట్  హల్వా  అంటే  ఇష్టం.
    (అస్సలు  ఎలా  మర్చిపోయాను  దీన్ని  ఇన్ని  రోజులు..!! ఈరోజు  తప్పనిసరిగా  తినాలి) 
·        
·        
·        
·        

నా  ఇష్టాలన్నీ  చదవడానికి  మీకు  ఓపిక  ఉండక  పోవచ్చు.
ఇంక  మీరు  ఆలస్యం  చేసి,  సమయం  వృధా  చెయ్యడం  దెనికి  ?
వెంటనే  మీ  ఇష్టాలని  రాయడం  మొదలు  పెట్టండి.
(గమనిక:  నా  ఇష్టాలని  కాపీ  కొట్టకండి  J)


హమ్మయ్య.....!!!
ఇప్పుడు  నేను  బాగా  సిద్ధంగా  ఉన్నాను.
దయచేసి  ఎవరన్నా  నన్ను  "నీకేమంటే  ఇష్టం  ......??"  అని  అడగరా!



5 comments:

  1. Good composition

    ReplyDelete
  2. niku yemante ishtam...???? ani malli malli adagalani nijanga ne anipistondi.. :-)
    very nice arun...

    ReplyDelete
  3. Avunu arun neeku em istamo cheppav, mari emante istam ledo avi kooda cheppava!!!

    ReplyDelete
    Replies
    1. hahaha :-) adi kooda oka page lo raasukunna. Kaani adi chinna list. Goda meeda balli, Road meeda arustunna kukka...ee rende gurthunnay prasthutaniki..!!

      Delete
  4. Telugu basha meeda prema abhimanam ila ne penchukundamu.Amma basha Naanna Basha mana Telugu.
    Andaritho manasu purthiga maatludukundamu.

    ReplyDelete

Popular Posts