Disable Copy Paste - HTML/JavaScript

Monday, October 27, 2014

అలంకరణ


అందం  కోసం  make-up  అనేది  ముఖానికే  కాదు,  మాటలకి  కూడా  ఉంటుంది.  ఒక  విషయాన్ని  అందంగా  చెప్పడానికి  make-up   వేసే   ప్రక్రియని   తెలుగు   grammar  లో  అలంకారాలు   ప్రయోగించడం   అని   చెప్పొచ్చు.

అలాంటి  అలంకారాలలో  ఒకటి  ‘తిశయోక్తి   అలంకారం’.  అతిశయోక్తి  అంటే  ఒక  విషయము,  ఉన్నదానికంటే  అధికము  చేసి  వర్ణించుట  అని  అర్ధం.  దీన్నే  ఇంకో  విధంగా  చెప్పాలంటే,  “బలపం  లాగ  ఉన్న  దాన్ని  chalk-piece  అంత  చేసి  చెప్పడం,  అనమాట  J.

 ఎప్పుడూ  నవ్వుతూ  ఉండాలి. నవ్వడం  ఆరోగ్యానికి  మంచిది”,   అన్న  మాటలకు   ఈ  make-up   వేసి   ఒక   పాట   పాడితే  ఎలా  ఉంటుందో   చూడాలంటే   క్రింది   వీడియోలో   చూడండి.




Monday, July 14, 2014

ఆహ...!! ఆ రోజులే వేరు


ETV లో  వార్తలు  వస్తుంటే  “స్కూల్  పిల్లలకు  వేసవి  సెలవులు  వచ్చేస్తున్నాయి”  అంటూ  ముఖ్యాంశాలలో  ఎదో  చెప్పినట్లు  వినిపించింది. 

అప్పుడు  “చెవుల  పండుగు”  లాగా  అనిపించింది. 

చూడటానికి  బాగున్నప్పుడు  కనుల  పండుగ  అంటారు  కదా,  మరి  వినడానికి  వినసొంపుగా  ఉన్నప్పుడు  చెవుల  పండుగ  అనడంలో  తప్పేముంది!  J

వేసవి  సెలవులు  అనే  శబ్దం  వినడానికి  ఎంత  బాగుందో....!!!

చివరి  రోజు  పరీక్ష  పూర్తయ్యాక  ఇంటికి  వెళ్తూ  ఉన్నప్పుడు  కలిగే  అనుభూతి  న  భూతో  న  భవిష్యత్!

ఈ  సాఫ్ట్  వేర్  ఉద్యోగం  లో  చేరాక    ప్రతి  సంవత్సరం  వేసవి  కాలం  వస్తోంది  కాని  వేసవి  సెలవులు  మాత్రం  రావట్లేదు.  పండుగ  సెలవులుsick  leaves,  paid  leaves,  weekends......  ఇలా   రకరకాల   సెలవులు  ఉంటాయి  కాని  వేసవి  సెలవులు  అనేవి  మాత్రం  సాఫ్ట్  వేర్  ఉద్యోగి  సిలబస్  లో  ఉండవు. 

వేసవైనా,  శీతాకాలమైనా  ఆఫీసులో  ID  కార్డు  swipe  చెయ్యాల్సిందే  L.

వేసవి  సెలవుల  గురించి  రాయాలని,  అప్పుడెప్పుడో  వేసవి  మొదలయ్యినప్పుడు  అనుకున్నాను.  కాని  ఇప్పటికి  తీరిక  దొరికింది. 

ఇంతకు  వేసవి  సెలవులు  అంటే  ఎందుకు  అంత  ఇష్టం,  అని  ఆలోచిస్తే  బాగానే  కారణాలు  దొరికాయి.
·       స్కూల్  కి  వెళ్ళే  పని  ఉండదు 
·       పరీక్షల  గోల  ఉండదు 
·       పొద్దున్నే  లేచి  రెడీ  అయ్యే  అవసరం  ఉండదు
·       మా  అమ్మమ్మ  వాళ్ళ  ఊరులో  exhibition  కి  వెళ్ళొచ్చు
·       ఎక్కువ  సేపు  ఆడుకోవచ్చు 
·       ...
·       ...
·       ...
·       ...
·       ...

ఇలా  చాలానే  ఉన్నాయి.  నాకు  గుర్తున్నంత  వరకు,  వేసవి  సెలవులలో  కాస్త  కష్ట  పడుతూ  చేసిన  ఒకే  ఒక్క  పని,  hand-writing  మెరుగు  పరుచుకోవడానికి  ప్రతి  రోజు  కొన్ని  పేజీలు  రాయడం  (నా  చేతి  రాత,  కాలుతో  రాసినట్లు  ఉండేది  లేండి  J).  కారణాలు  కాసేపు  పక్కన  పెట్టేద్దాం.

ఒక  ఐడియా!
సాఫ్ట్  వేర్  ఇంజనీర్లు  అంత  కలిసి  సెలవుల  కోసం  strike  చేస్తే...??

వద్దులే!  అసలే  ఇన్ని  రోజులు  తెలంగాణా  కావాలని  కొందరు,  వద్దని  కొందరు  చాలా  strike  లు  చేసారు.  ఈ  మధ్యనే  ఆ  strike  లనుంచి  విముక్తి  దొరికింది.  మళ్లీ  strike  అంటే  బాగుండదు  లేండి.

ఇంకో  ఐడియా!

చిన్నప్పుడు  వేసవిలో  మార్నింగ్  స్కూల్  అని  ఉండేది  కదా,  ఇప్పుడు  కూడా    మార్నింగ్  ఆఫిస్  అని  పెడితే  ..........?????    

ఇదేదో  బాగున్నట్లుందే..!!! 

అమ్మో..!!  సగం  time  ఇచ్చి  మొత్తం  పని  చెయ్యమంటే,  మొదటికే  మోసం  వచ్చేస్తుంది.  ప్రస్తుతానికి  ఇలాగే  సెలవులు  లేకుండ  సరిపెట్టుకోవాల్సిందే.

ఈ  సాఫ్ట్  వేర్  ఉద్యోగం  దయ  వల్ల  వేసవి  సెలవులనేవి  లేకుండా  పోయినా,  బెంగుళూరు  దయవల్ల  ఎండాకాలం  లో  ఎండకాలం కష్టాలు  కూడా  లేకుండా  పోయాయి.  ఒకటి  కావాలంటే  ఇంకొకటి  వదులుకోవాల్సి  వస్తుందంటే  ఇదేనేమో!

కాసేపు  బాధ  పడడం  ఆపి  ఫ్లాష్  బ్యాక్  లోకి  వెళ్తే...

వేసవి  సెలవులు  మొదలయ్యే  అనుభూతి  గురించి  మాట్లాడాం  కదా!
ఆలాగే  సెలవులు  అయ్యాక  స్కూలు  మొదలవ్వడం  కూడా  అదో  తరహ  అద్భుతమైన  అనుభూతి.

కొత్త  text  books  కొనడం,  వాటికి  అట్టలు  వెయ్యడం,  sticker  లు  అంటించడం  (అదే  నా  విషయం  లో,  పాత  text  books  కి  మళ్లీ  అట్టలు  వెయ్యడం,  sticker  లు  అంటించడం.  ఎందుకంటే,  మా  అన్న  తన  ఆస్తి  నాకు  రాసిస్తాడు  కాబట్టి  J),  స్కూల్  లో  కొత్త  time-table,  కొత్త  బట్టలు*(conditions  apply  J),  కొత్త  టీచర్లు*  (ఇది  కూడా  conditions  apply  J)  ........  అలా  స్కూల్  మొదలవుతుంది. 

ఇప్పుడు  ఎలాగో  వేసవి  సెలవులు  లేవు  కాబట్టి,  కనీసం  ఒకప్పటి  జ్ఞాపకాలు  గుర్తు  చేసుకోవడానికి  సమయం  కేటాయించుకున్నందుకు  నా  ఈ  weekend  కి  మోక్షం  కలిగింది.

సరే మరి.... మళ్లీ  వచ్చే  వేసవి  సెలవుల్లో  దీని  గురించి  మాట్లాడదాం J


Sunday, April 20, 2014

లిల్లీ


( గమనిక:  ఇది   కల్పనతో   కూడిన   పిల్లల   నీతి   కథ )

“అనగనగ   ఒక   ఊరులో   రాము   మరియు   సీత   అని   భార్యాభర్తలు   ఉండేవారు.      ఆ   ఇద్దరు   కాస్త   రెండు   సంవత్సరాలలో   నలుగురు   అయ్యారు.   ఈ   దంపతులకు   మొదటి   సంతానం   కలిగినప్పుడు   చిన్న   విషయం   మీద   పెద్ద   గొడవ   వచ్చింది.   “నేను   చెప్పిన   పేరు   పెట్టాలి,   అని   సీత   అంటే,   “కాదు!   నేను   చెప్పిన   పేరు   పెట్టాలి,   అని   రాము   అంటూ   ఇద్దరు,   అసెంబ్లీలో   అధికార   పార్టీ   ప్రతిపక్ష   పార్టీ   లాగ   గొడవ   పడ్డారు.   చివరికి   ఇద్దరు   ఈ   విషయం   మీద   రాజీ   పడి   ఒక   ఒప్పందానికి   వచ్చారు.   ఎలాగో   ఇద్దరు   పిల్లలు   కావాలనుకున్నారు   కాబట్టి,   ఒకరికి   సీత   ఇంకొకరికి   రాము   పేరు   పెడదామని   నిర్ణయించుకున్నారు.   మొదట   ఎవరు   పేరు   పెట్టాలన్న   విషయాన్ని   ఒక   రూపాయి   బిళ్ళకు   అప్పగించారు.   బహుశా   సీత,   డబ్బును   తెలివిగా   పొదుపుగా   వాడే   ఇల్లాలు   లాగ   ఉన్నట్లుంది.   టాసు   వేస్తే   సీతకు   అనుకూలంగా   వచ్చింది.   మొదటి   పాపకు    సీత,   “అనన్య”   అని   పేరు   పెట్టింది.   రాముడికి   కృష్ణుడు   అంటే   బాగా   ఇష్టమేమో!   మరుసటి   సంవత్సరం   పుట్టిన   బాబుకు   రాము,   “కృష్ణ   అని   పేరు   పెట్టాడు.


అనన్యకు   పిల్లులు   అంటే   విపరీతమైన   పిచ్చి.   కృష్ణకేమో   కుక్కపిల్లలు   అంటే   అంతే   పిచ్చి.   ఒక   రోజు   రాము   ముద్దొచ్చే   పిల్లిని,   కుక్కపిల్లని   ఇంటికి   తీసుకొచ్చాడు.   ఈసారి   వాటికి   పేరు   పెట్టడానికి   దంపతలు   గొడవ   పడకుండా   అక్కాతమ్ముళ్ళకి   వదిలేసారు.   అక్క   పిల్లికి   “లిల్లీ   అని,   తమ్ముడు   కుక్కపిల్లకి   “స్నూపీ   అని   ఇద్దరు   నామకరణం   చేసారు. ఆ   అక్కాతమ్ముళ్ళు   చూపించే   గారాబంతో   లిల్లీ   మరియు   స్నూపీ   విలాసవంతమైన   జీవితం   గడిపేవి.   వీళ్ళిద్దరూ   వయసుతో   పాటు   వీళ్ళు   చూపించే   గారాబం   కూడా   పెంచుతూ   వచ్చారు.   గారాబం   చెయ్యడం   అనేది   వీళ్ళకు   రోజువారి   అవసరాలలో   ఒకటైపోయింది.


ఏడవ   తరగతి   అయ్యాక   అనన్యకు   మంచి   పాఠశాలలో   చదవడానికి   అవకాశం   వస్తుంది.   కొన్ని   సార్లు   మంచి   వార్తలు   తమతో   విషాదాన్ని   కూడా   తోడు   తీసుకొస్తాయేమో!   అనన్య   ఇల్లు   వదిలి   హాస్టలుకు   వెళ్ళాల్సిన   పరిస్థితి   వస్తుంది.   హాస్టలులో   లిల్లీని   అనుమతించరని   తెలిసి,   లిల్లీని   తనతో   తీసుకెళ్లడానికి   కుదరక   పోవడంతో   బాగా   దిగులు   పడుతుంది.


అనన్య   ఎందుకు   అలా   దిగులుగా   ఉందొ   లిల్లీకి   ఇంకా   ఏమాత్రం   అర్ధం    కాక,   తన   ఒడిలో   కూర్చుని   ఓదార్చడానికి   ప్రయత్నిస్తుంది.   అనన్య   ప్రయాణిస్తున్న   సామాను   చూడగానే,   “మిఆవ్   మిఆవ్......!!   అని   అరవడం   మొదలు   పెట్టింది.   బహుశా   “వెళ్లొద్దు   వెళ్లొద్దు......!!””   అని   తన   భాషలో   చెప్పిందేమో.   లిల్లీని   అమ్మకు   అప్పగించేసి   అనన్య   వెళ్ళిపోతుంది.


సీత,   లిల్లీని   బాగా   చూసుకున్తున్నపటికీ,   లిల్లీకి   మాత్రం   అనన్య   లేని   లోటు   బాగా   ఉండేది.


ఇప్పుడు   నన్ను   ఎవరు   గారాబం   చేస్తారు   ?
నాకు   మంచి   ఫోటోలు   ఎవరు   తీస్తారు   ?
నేను   వేసే   డాన్సులు   ఎవరు   వీడియో   తీస్తారు   ?
నేను   అలిగితే   ఎవరు   బుజ్జగిస్తారు   ?,   అని   దిగులు   పెట్టుకుంటుంది   లిల్లీ.


ఇంకో   వైపు   అనన్య   కూడా   మొదట్లో   బాగానే   బాధపడేది.   కాని   చదువుల్లో   పడ్డాక,   బాధ   క్రమంగా   తగ్గింది.  


ఇలా   ఉండగా   ఒక   రోజు,   “నేనే   నీ   కంటే   గొప్ప!   అందుకే   నాకు   ఈ   ఇంట్లో   ప్రత్యేక   స్థానం   ఉంది”,   అని   స్నూపీ   లిల్లీని   ఎగతాళి   చేస్తుంది.  


కాదు!   కృష్ణ   వల్ల   నీకు   ఇంట్లో   ప్రత్యేక   స్థానం   ఉంది   కాని,   నువ్వు   అంత   గొప్పేమీ   కాదు,   అని   లిల్లీ   సమాధానమిస్తుంది.  


లిల్లీ   సమాధానం   పట్టించుకోకుండా,   స్నూపీ   ఎగతాళి   చేస్తూనే   ఉంటుంది.  


పోటి   పెట్టుకుంటే   ఎవరు   గొప్పో   తెలుస్తుంది   కాని,   నీకు   నువ్వు   గొప్ప   అనుకుంటే   సరి   పోదు.   మరి   పోటీకి   నువ్వు   సిద్ధమేనా   ..?,   అని   స్నూపీకి   సవాలు   విసురుతుంది   లిల్లీ.


స్నూపీ   కూడా   పౌరుషంతో   సవాలుకి   ‘సై’   అంటుంది. ఇద్దరు   కలిసి   పోటీలో   ఐదు   పనులు   నిర్ణయిస్తారు.

1)    మూడు   రౌండ్లలో   ఎవరు   ఎక్కువ   దూరం   గెంతుతారో
(లాంగ్   జంప్),   వాళ్ళే   గెలిచినట్లు”
పాపం   లిల్లీ   ఒక్క   అడుగు   దూరంతో   ఓడిపోతుంది.

2)  పరుగు   పందెం   –   ఒక   రౌండ్   మాత్రమే
మొదటి   గెలుపుతో   స్నూపీ   కళ్ళు   నెత్తికెక్కేస్తాయి.   ఆ   గర్వం,   అతి   నమ్మకంతో   ఈ   సారి   ఓడిపోతుంది.

3)  షర్టు   గుండీని   కిటికీలో   నుంచి   తోటలోకి   విసిరాక,   దాన్ని   ఎవరు   ముందు   తెస్తారో   వాళ్ళు   గెలిచినట్లు
లిల్లీ   నిజాయితీగా   ప్రయత్నం   చేసినప్పటికీ,   స్నూపీ   పుట్టుకతోనే   వాసన   పసిగట్టడంలో   ప్రావీణ్యం   ఉంది   గనుక   తను   ఓడిపోతుంది.  

4)  మూడు   రౌండ్లలో   బంతిని   ఎవరు   ఎక్కువ   దూరానికి   తంతారో   వాళ్ళు   గెలిచినట్లు
ఈ   సారి   లిల్లీ   నిజాయితీగా   చేసిన   ప్రయత్నం   వృధా   అవ్వలేదు.   మూడు   రౌండ్లలో   లిల్లీనే   గెలుస్తుంది.

5)  తోటలో   ఫుట్   బాల్   ఆట
ఇప్పటి   వరకు   ఇద్దరరు   చెరో   రెండేసి   సార్లు   గెలిచారు.
ఇదే   చివరి   పని.   పోటీ   గెలుపు   ఈ   పని   మీద   ఆధార పడింది.
గెలిచిన   క్రమం   అనుసరిస్తే   ఈసారి   స్నూపీ   గెలవాలి.
కాని   క్రమం   లిల్లీని   ఓడించలేక   పోయింది.   పోటీలో   లిల్లీ   నెగ్గుతుంది.


చాలా   రోజులుగా   దిగులుగా   ఉన్న   లిల్లీ   ఆరోజు   తన   గెలుపుని   బాగా   ఆశ్వాదిస్తూ   ఆనందపడుతుంది.   కృష్ణ   వచ్చి   స్నూపీని   గారాబం   చెయ్యడంతో,   గెలిచిన   సంతృప్తి   కాసేపటికే   ఆవిరైపోతుంది.   ప్రేమానురాగాలు   లేకపోతే,   ఎన్ని   పోటీలు   గెలిచినా,   ఎంత   డబ్బు   ఉన్నా   ఆనందం   ఉండదని   లిల్లీకి   తెలుసేమో!   మళ్లీ   తన   దిగులు   లోకానికి   వెళ్ళిపోతుంది.   పోటీ   జరిగిన   మరుసటి   రోజు,   స్నూపీ   దిగులుగా   ఉండడం   చూసిన   లిల్లీ,   విషయం   ఏంటని   అడుగుతుంది.   “కృష్ణ   తన   స్నేహితులతో   ఎదో   పర్యటనకి   వెళ్ళాడు.   ఇంకో   మూడు   వారాలయ్యాక   వస్తాడట,   అని   చెప్తుంది.


మూడు   వారాలే   కదా!   ఇట్టే   అయ్యిపోతాయి   చూడు.   నువ్వు   దిగులు   పడొద్దు.   నీకేమన్నా   సాయం   కావాలంటే   చెప్పు.   నేను   చేస్తాను,   అని   లిల్లీ   ఓదారుస్తుంది.  


ఈ   మాటలు   విన్న   స్నూపీ   తన   తప్పు   తెలుసుకుంటుంది.     


నిన్ను   హేళన   చేసినందుకు   నన్ను   క్షమించు!”,   అని   పశ్చాత్తాపం   చెందుతూ,      “పద!   నీకు   ముక్కుతో   వస్తువులు   ఎలా   పసిగట్టాలో   నేర్పిస్తాను.   నువ్వు   నాకు   ఫుట్   బాల్   ఎలా   ఆడాలో   నేర్పించు,   అని   లిల్లీని   తోటకి   లాక్కెళ్తుంది   స్నూపీ.  


ఆరోజు   నుంచి   కలిసి   ఆడుకుంటూ   సమయం   గడిపేవారు”,  


అని   తెలుగు   మాష్టారు   కథను   ముగిస్తే,   మొదటి   బెంచి   మీద   కూర్చున్న   కిరణ్,   ఆవలిస్తాడు.   “ఏరా   కిరణ్!   అంత   పెద్దగ   ఆవలిస్తున్నావు.      నేను   చెప్పిన   కథ   నీకు   జోల   పాట   లాగా   అనిపిస్తోందా   ?”,   అని   తమాషాగా   అడిగారు   తెలుగు   మాష్టారు.


లేదు   సార్!   కథ   చాలా   బాగుంది.   మొదట్లో   కొంచెం   నెమ్మదిగా   అనిపించినా,   తరువాత   లిల్లీ   స్నూపీ   సంభాషణలు   బాగా   నచ్చాయి,   అని   కిరణ్   సమాధానమిస్తాడు.  


కథ   అంత   బాగా   నచ్చిందా!   అయితే   ఈ   కథ   వల్ల   నువ్వు   తెలుసుకున్న   నీతి   ఏంటో   చెప్పగలవా   ?,   అని   మాష్టారు   కిరణ్ ని   ప్రశ్నిస్తారు.


లిల్లీ   తను   కష్టపడి   చేసిన   ప్రయత్నం   విఫలమైనప్పటికీ,   గెలుపు   మీద   ఆశ   కోల్పోకుండా   అదే   నిగ్రహం   తరవాతి   ఆటలో   కొనసాగిస్తుంది.   మనం   కూడా   ఓటమి   ఎదురయ్యినప్పుడు   నిరాశ   పడకుండా,   అదే   పట్టుదలని   చూపించాలి,   అని   కిరణ్   వివరిస్తాడు.


బాగా   చెప్పావురా   కిరణ్!   నిజాయితిగా   చేసిన   ప్రయత్నం   గెలుపు   రుచి   చెయ్యక   మానదు”,   అని   తెలుగు   మాష్టారు   కిరణ్ ని   మెచ్చుకుంటారు.


కిరణ్ ని   మెచ్చుకున్నారో   లేదో,   వెంటనే   పక్కనే   ఉన్న   జానకి,   “నేను   కూడా   ఒక   నీతి   తెలుసుకున్నాను   సార్!”,   అంటూ   చేతులేత్తుతుంది.   అది   చూసి   తెలుగు   మాష్టారు,   “జానకమ్మా!   నువ్వు   తెలుసుకున్న   నీతి   ఏమిటమ్మా..??,   అని   ప్రాసతో   హాస్యంగా   జానకిని   అడుగుతారు.


నేను   తెలుసుకున్న   నీతి   ఏంటంటే,   “గెలుపు   వచ్చాక   స్నూపీ   లాగా   కళ్ళు   నేత్తికేక్కించుకోకూడదు.   లేకపోతే   ఒటమి   చవి   చూడాల్సి   వస్తుంది”,   అని   జానకి   వివరిస్తుంది.


జానకమ్మా!   నువ్వు   తెలుసుకున్న   నీతి   కూడా   బాగుందమ్మా!”,   అని   మళ్లీ   ప్రాసతో   జానకిని   మెచ్చుకుంటూ,   “ఇప్పుడు   నా   వంతు.   నేను   తెలుసుకున్న   నీతులు   చెప్తాను”   అని   మాష్టారు   తన   నీతుల   చిట్టా   విప్పారు.


మన   జానకమ్మ   చెప్పినట్లు,   గెలవడం   అనేది   పేకమేడలు   కట్టడం   లాంటిది.   ఏమాత్రం   చురుకుగా   లేకపోయినా   సరే,   ఇట్టే   కూలిపోతుంది


అనుభవిస్తే   కాని   అర్థం   కానివి   కొన్ని   ఉంటాయి.   
కాబట్టి   స్నూపీ   లాగా   ఎదుటి   వాళ్ళను     
అర్ధం   చేసుకోలేక   పోయినా,   హేళన   మాత్రం   చెయ్య   కూడదు


పశ్చాత్తాపానికి   మించిన   ప్రాయశ్చిత్తం   లేదు.   
కొన్ని   తప్పులను   దిద్దుకోవడానికి   అవకాశం   దొరుకుతుంది.   
స్నూపీ   లాగా   ఆ   అవకాశాన్ని   ఉపయోగించుకోవాలి



ఇలా   తెలుగు   మాష్టారు   తన   నీతులు   చిట్టా   విప్పిన   తరువాత   పాఠశాల   బెల్   మోగింది.   రేపు   ఇంకో   కథ   చెప్పుకుందామని,   మాష్టారు   క్లాసు   నుంచి   వెళ్ళగానే   గుసగుసలు   మొదలయ్యాయి. 
  


Thursday, March 27, 2014

అమ్ములు ఎలా ఉంటుందంటే...


- మా  అమ్మ  గీసిన  అమ్ములు  ప్రతిబింబం -

( 'అమ్ములు!'  గురించి  చదవడానికి  ఇది  క్లిక్  చెయ్యండి)


Saturday, January 4, 2014

అమ్ములు!


ప్రియమైన   అమ్ములుకి,

ఉత్తరం   రాస్తుంటే   ఏంటో   కొత్తగా   ఉంది.  
అప్పుడెప్పుడో   పదవ   తరగతి   తెలుగు   పరీక్షల్లో   ఉత్తరం   రాసినట్లు   గుర్తు.  

2013   మే   13 న      నువ్వు   ఫోన్   చేసి,   “నాకు   హైదరాబాదు   లో   ఉద్యోగం   వచ్చింది   అన్నయ్యా....!! ”,   అని   చెప్పగానే   నాకు   చాలా   ఆనందం   వేసింది.   నా   కళ్ళెదురుగా   నువ్వు   లేనప్పటికీ,   నీ   ఉత్సాహం   అంతా   నీ   మాటల్లో   కనపడింది.  

నాకు   చాలా   గర్వంగా   కూడా   ఉంది.   మన   కుటుంబం   లో   మొట్టమొదట   జీతం   తీసుకుంటూ   ఉద్యోగం  చేయ్యబోతున్నావు.  

మొదట్లో   నిన్ను   స్కూల్   లో   చేరిపించేటప్పుడు   నేను   చాలా   గొడవ   చేశానమ్మా.  నాన్న   గారు   పోయాక   నాదే   ఇంక   అంగడి   చూడాల్సిన   భాద్యత.  

"నాతో   పాటు   అంగడిలో   పనులు   చూసుకుంటూ,   ఇంట్లో   నీకు   తోడుగా   ఉంటుంది",   అని   అమ్మ   తో   అన్నాను.  

అమ్మ   నాకు   అంగడి   లో   తోడుగా   ఉంటానందే   కాని,   నిన్ను   మాత్రం   చదువు   మానిపించే   ప్రసక్తే   లేదు   అని   పట్టు   బట్టి   మరీ   స్కూల్   లో   చేరిపించింది.  

నన్ను   క్షమించు   అమ్ములు!  
అప్పుడు   ఏదో   తెలియక   అలా   చేశాను.  

అయినా   ఓ   రకంగా   అలా   జరిగినందుకు   ఒక   ఉపయోగం   కూడా   ఉందిలే.  
మా   చదువుల   తల్లి   అమ్ములు   కథ   ఆసక్తికరంగా   చందమామ   కథ   లాగా   చెప్పడానికి   అందులో   ఒక   విల్లన్   కూడా   ఉన్నాడు  J.

ఆరోజు   నువ్వు   ఫోన్   లో   మాట్లాడుతున్నపుడు   ఉన్న   ఆనందం,   ఎక్కువ   సేపు   ఉండలేదు.  ఇంజనీరింగ్   చదవడానికి   పక్క   ఊరుకి   పంపించగలిగాను      కాని   ఇప్పుడు   ఉద్యోగానికి   ఒంటరిగా   హైదరాబాదు   పంపాలంటే   ఏంటో   దిగులుగా   ఉంది.   రోజులు   చాలా   దారణంగా   అయ్యిపోయాయి.   సమాజం   లో   అమ్మాయిలకు   జరుగుతున్న   అరాచకాలు   రోజు   రోజుకి   పెరిగిపోతున్నాయి.  

నీ   ఉద్యోగం   సంగతి   మీ   లెక్కల   మాష్టారుతో   మాట్లాడాను.   ఆ   మాటలు   విన్నాక   కొంచెం   ధైర్యం   వచ్చింది!
  
పెప్పర్   స్ప్రే   అని   స్విస్   నైఫ్   అని   ఆత్మరక్షణకి   పనికొస్తాయట.  
వాళ్ళ   బంధువుల   అమ్మాయి   ఒకరు   హైదరాబాద్   లో   ఉద్యోగం   కోసం   వెళ్తోందని   ఇవి   తెప్పిస్తున్నారట.  నీ   గురించి   చెప్పగానే   నీకు   కూడా   తెప్పిస్తానన్నారు   లెక్కల   మాష్టారు.

లెక్కల   మాష్టారుకి   ఒక   సారి   ఫోన్   చేసి   మాట్లాడమ్మా.   ఆయనకి   నువ్వంటే   చాలా   ఇష్టం.   ఎప్పుడు   కనిపించినా   “అమ్ములు   ఎలా   ఉంది   ..??   ఎప్పుడొస్తుంది   సెలవులకు   ఇంటికి   ...??”,    అని   నీ   గురించి   ఖచ్చితంగా   అడుగుతారు.  

ఇంకో   ముఖ్యమైన   విషయం.  
ఏకాంతగా   ఉన్న   ఎటిఎం’   లో   డబ్బులు   తీసుకోవడానికి   ఎట్టి   పరిస్థితుల్లో   వెళ్లోదమ్మా.  

ఇవన్నీ   నిన్ను   భయపెట్టడానికి   చెప్పట్లేదు   అమ్ములు.  
ఆపద   ఏ   రూపంలో ఎప్పుడు   వస్తుందో   మనకు   తెలియదు.  
నువ్వు   ఎల్లప్పుడూ   అప్రమత్తంగా   ఉండాలి.  

చిన్నప్పుడు   నువ్వు   వ్యాస   రచన   పోటిల్లో   “ఆరోగ్యమే   మహా   భాగ్యం!”   అనే   అంశం   మీద   వ్యాసం   రాస్తే   మొదటి   బహుమతి   వచ్చింది   కదా!  
గుర్తుందా   ...???
ఉద్యోగం   లో   చేరాక   ఆరోగ్యం   నిర్లక్ష్యం   చేయద్దు.  
నువ్వు   రాసిన   వ్యాసం   అప్పుడప్పుడు   గుర్తు   తెచుకుంటూ   ఉండమ్మా.  

ఇంక   ఉంటాను!

---------------------------------------------------------------------------------
ఉద్యోగంలో   చేరాక   మొదటి   నెల   జీతం   రాగానే   అన్నయ్యకి   అమ్మకి   కొత్త   బట్టలు,   లెక్కల   మాష్టారుకి   ఒక   గడియారం   తీసుకుని   ఇంటికి   వెళ్లి   అందరిని   ఆశ్చర్యపరిచింది   అమ్ములు.  
ఆ   రోజు   వాళ్ళ   జీవితం   లో   సంతోషకరమైన   రోజులలో   ఒకటిగా   ముగిసింది.
---------------------------------------------------------------------------------



Popular Posts